RTC Driver | పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తుండగా.. పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుండి తొలగిస్తూ జగిత్యాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రిమూవల్ లెటర్ జారీ చేశారని తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశాడు. నేను బస్సు నడుపుకుంటూ వస్తున్న. వాళ్లు కాంగ్రెస్ (ఎమ్మెల్యేలు, మంత్రులు) ధర్నా చేస్తూ వస్తున్నరు. నేను అక్కడే సైడ్‌కు ఆగిన. అక్కడ మా ఊరు ఆయన ఉన్నడు. నేను చాలా సాదాసీదాగా మాట్లాడిన. డ్రైవింగ్‌లో ఉన్న కానీ బస్సును పక్కకు ఆపి మజ్జిగ ప్యాకెట్లు ఇస్తుంటే తీసుకున్నా. అక్కడున్నాయను ఏం చేస్తున్నరు అని అడిగితే పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడుతున్నమంటే.. దాని గురించి కాదు.. రైతులు పరేషాన్ అయితుర్రు ముందు వడ్లు, మక్కల గురించి మాట్లాడుర్రి అని చెప్పి వెళ్లిపోయిన గంతే. ఏ రాజకీయ నాయకుడి పేరు తీయలేదు. ఏ పార్టీ గురించి మాట్లాడలేదు. ఎవరి గురించి మాట్లాడలేదన్నాడు.
పరిస్థితి గిట్లున్నది.. రైతులు ఆగమైతుర్రు. రోహిణి వస్తుంది.. వర్షం వస్తే ఆరు నెలల నుంచి కష్టపడ్డది అంతా వృధా అయితది అని చెప్పిన కానీ అంతకుమించి నేనేం అడగలేదు. ఈ విషయంలో నా డ్యూటీ ఆపేసిర్రు. నీ డ్యూటీ తీసేసినం.. నువ్వు ఇక ఉద్యోగానికి రాకు అని డీఎం మాట్లాడుతున్నరు. ఆర్ఎం నుంచి నీకు లెటర్ వచ్చింది.. 5 డిపోలకు నీకు డ్యూటీ ఇయ్యకుండా లెటర్ పంపిండు.. అని చెప్పిండని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ధర్నా చేస్తున్న సమయంలో మా ఊరి వ్యక్తితో ముందు వడ్లు గురించి మాట్లాడండి అని చెప్పాను
దానికి నిన్ను డ్యూటీలో నుండి తీసేసాము నువ్వు రాకు అని జీఎం చెప్పాడు
జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై చర్యలు తీసుకున్న అధికారులు
నేను ఏ రాజకీయ… https://t.co/hDU0cgi8lJ pic.twitter.com/UEtQcTt6I4
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026