Chicken Biryani | కోరుట్ల, మార్చి 8 : చికెన్ బిర్యానీలో ఈగ ప్రత్యక్షమైన ఘటన కోరుట్లలో వెలుగుచూసింది. కోరుట్లలోని ఇష్టా రెస్టారెంట్లో చికెన్ బిర్యానీని ఆర్డర్ ఇవ్వగా.. భోజనంలో ఈగ దర్శనమిచ్చింది. అయితే ఊహించని విధంగా బిర్యానీతోపాటు ఉడికించిన ఈగ రావడంతో కంగుతిన్న కస్టమర్లు యాజమాన్యాన్ని నిలదీశారు.
అయితే ఏదో అనుకోకుండా వచ్చిందని సర్దుకుపోవాలని యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం కొసమెరుపు. గతంలోనూ ఈ రెస్టారెంట్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించి కుళ్లిన మాంసం, మిగిలి పోయిన ఆహారం స్వాధీనం చేసుకొని రూ. 12 వేలు జరిమానా కూడా విధించారు.
రెస్టారెంట్లో నాసిరకం ఆహార పదార్థాలు వడ్డిస్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యత లేని ఆహారం అందిస్తున్న రెస్టారెంట్లపై కొరడా ఝులిపించాలని కోరుతున్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్