RTC Driver | ముందు వడ్లు, మక్కల గురించి పట్టించుకోండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆర్టీసీ డ్రైవర్ చురకలు
RTC Driver | రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలంటూ రైతన్నలురోడ్డెక్కి ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు అధికార కాంగ్రెస్ నేతలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా రోడ్డెక్కడంపై ఆర్టీసీ డ్రైవర్ తనదైన శైలిలో వారికి చురకలించాడు.
RTC Driver | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగిత్యాలలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. అయితే కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తుండగా అదే మార్గంలో వస్తున్న ఓ ఆర్టీసీ డ్రైవర్ వారికి ఝలక్ ఇచ్చాడు.
రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలంటూ రైతన్నలురోడ్డెక్కి ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు అధికార కాంగ్రెస్ నేతలు ఇలా రోడ్డెక్కడంపై ఆర్టీసీ డ్రైవర్ తనదైన శైలిలో వారికి చురకలించాడు. పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి ఆందోళ తర్వాత చేయొచ్చు కానీ.. ముందు వడ్లు, మక్కలు కొనట్లేదు.. ముందు వాటి గురించి పట్టించుకోండి.. అంటూ సదరు ఆర్టీసీ డ్రైవర్ వారికి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పెట్రోల్ రేట్ల గురించి తర్వాత ముందు వడ్లు, మక్కలు కొనట్లేదు
ముందు దాని సంగతి చూడండి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల గురించి జగిత్యాలలో ధర్నా చేస్తున్న మంత్రి అడ్లురి లక్ష్మణ్, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చిన ఆర్టీసీ డ్రైవర్ pic.twitter.com/WSaD9d9hsj
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026
Read Also :
KTR | అధైర్యపడొద్దు.. అండగా నిలుస్తాం.. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే: కేటీఆర్
Petro prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరో రూ.20 పెరగనున్నాయా..?
Rakshitha Suresh | ‘హల్లల్లల్లో’తో హాట్ టాపిక్‌గా మారిన సింగర్.. ‘పెద్ది’ పాటతో హాట్ టాపిక్‌గా మారిన రక్షిత సురేష్!
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

