Dava Vasantha | జగిత్యాల, ఫిబ్రవరి 20 : జగిత్యాల జిల్లాలో పంటలు వేసిన రైతులకు సకాలంలో ఎరువులు, నీళ్లు ఇవ్వలేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత మండిపడ్డారు. మార్పు రావాలి అంటే ఇదేనా మీ మార్పు.. అని ఏద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో సకాలంలో విత్తనాలు, ఎరువులు, నీళ్లు, కరెంట్ అందజేశామని ఆమె గుర్తు చేశారు.
జగిత్యాల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే గోస పడుతమని.. చెప్పారు. ఇప్పుడు రైతులకు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వడం లేదు. ఉమ్మడి సారంగాపూర్ మండలంలో ఇటీవల పంట ఎండిపోయిన రైతు బాధను చూసాం. జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి, తాటిపెల్లిలో తూములు ధ్వoసమై నీళ్లు రాక రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ఇంత వరకు వ్యవసాయంఫై రాష్ట్రంలో, జిల్లాలో ఒక సమీక్ష సమావేశం లేదు. యూరియా నిల్వలు లేవు.. పీఏసీఎస్ వారు యూరియా కోసం డబ్బులు కట్టినా కూడా మార్క్ ఫెడ్ ద్వారా రావడం లేదు. అత్యవసర యూరియా నిల్వలు, ఒక్క యూరియా బస్తా కూడా నిల్వ లేదు. కేసీఆర్ మీద కోపం రైతులపై చూపకండి సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. దయచేసి రైతులకు వెంటనే ఎరువులు, నీళ్లు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!