Rekha Gupta | ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి (Delhi Chief Minister) ఎవరన్న దానిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. షాలిమార్‌బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తా (Rekha Gupta)ను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం బుధవారం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వివాదాస్పదంగా మారిన ‘శీష్ మహల్’ (Sheeshmahal) గురించి స్పందించారు.
#WATCH | On asking if she will stay in the ‘Sheesh Mahal’ after the oath ceremony, Delhi CM designate Rekha Gupta says, “Nahi, Nahi…” pic.twitter.com/BSIQjgMikM
— ANI (@ANI) February 20, 2025
సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ (6 Flagstaff Road) రోడ్ బంగ్లా ‘శీష్ మహల్’ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే, గత కేజ్రీవాల్ హయాంలో ఆ మహల్ తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన రేఖా గుప్తాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బంగ్లాలో ఉంటారా..? అని మీడియా పశ్నించింది. దీనికి ఆమె ‘లేదు.. లేదు’ అంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. ‘శీష్ మహల్’ను మ్యూజియం (Museum)గా మారుస్తామని వెల్లడించారు. తనను సీఎం పదవికి ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధాని ఇచ్చిన హామీలన్నీ నెరెవేర్చనున్నట్లు స్పష్టం చేశారు.
#WATCH | Delhi CM-designate Rekha Gupta shows a victory sign and accepts the greetings of people as she leaves from her residence. pic.twitter.com/LDCQZAICBb
— ANI (@ANI) February 20, 2025
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివాసం 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు బంగళా విస్తరణ, మరమ్మతులు, అలంకరణల కోసం అధికంగా ఖర్చు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 2015 నుంచి గత అక్టోబర్ వరకు ముఖ్యమంత్రిగా ఆ బంగళాలో అరవింద్ కేజ్రీవాల్ నివసించారు. ఢిల్లీ సీఎం అధికార నివాసాన్ని దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో ఆ బంగళాకు శీష్ మహల్ అని బీజేపీ పేరు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ‘శీష్ మహల్’ అంశం కూడా ఓ ప్రధాన కారణమే.
Also Read..
“ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. నేడు ప్రమాణం”
Delhi | రేఖా గుప్తాపాటు ప్రమాణం చేయనున్న మంత్రులు వీరే..
సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాల్లేవు