Aksharabhyasam | వెల్గటూర్, జూన్ 18 : వెల్గటూర్ మండలంలోని పాశిగామ ప్రాథమిక పాఠశాల, కిషన్ రావు పేటలో ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులకు సంప్రదాయ బద్దంగా పూజా కార్యక్రమాల మధ్య అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి బోనగిరి ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పీఎం పోషణ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు రోజులు కోడిగుడ్లు, మూడు రోజులు రాగి జావ అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చిప్ప నందయ్య, ప్రధానోపాధ్యాయులు నీలం సంపత్, నర్ముల గంగన్న, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తరాళ్ల సత్యవతి, ఆలయ కమిటీ చైర్మన్ బరుపటి జనార్ధన్, అర్చకులు గంట్యాల విద్యాసాగర్, తిరునహరి సాయికృష్ణ, ఉపాధ్యాయులు మహేష్, భవాని, మునీంద్ర, వనిత, శిరీష, సీఆర్పీ వైద్య వెంకటేష్, ఉపాధ్యాయుల తల్లిదండ్రులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్