Pocso Case | పోక్సో, హత్య కేసులు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు, యావజ్జీవ కారాగార శిక్ష
Pocso case | జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ కుమార్కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో చందుర్తి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు.
Pocso case | గాంధీ చౌక్ : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసుతోపాటు, అదే బాలికను హత్య చేసిన కేసులో నిందితుడు బండపల్లి నవీన్ కుమార్ (27)కు పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ కుమార్కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో చందుర్తి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం 2020 డిసెంబర్ 4న నిందితుడు బాలికను ఆమె ఇంటి నుంచి అపహరించి గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసిన అనంతరం జరిగిన విషయాన్ని బయటపెడుతుందనే భయంతో బాలికకు విషం తాగించి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను నిందితుడు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది.
సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ..
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీసులు హత్య, అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ రెండు కేసులు సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చాయి. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై నేరాలు రుజువైనట్లు నిర్ధారించింది. దీంతో పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.7,000 జరిమానా, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ కేసుల్లో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి డీఎస్పీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ వెంకటేష్, కోర్టు కానిస్టేబుళ్లు మహేందర్, లతీఫ్, నవీన్, వెన్నెలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.
Read Also :
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

