వీపనగండ్ల, ఆగస్టు 17: ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడిన చరిత్ర లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని భీమా 26, 27, 28 ప్యాకేజీ కాల్వలకు సాగునీరు అందకపోవడంతో రైతులతో కలిసి కాల్వలను పరిశీలించారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టకాలం వచ్చిందన్నారు. రైతులకు సాగునీరు, విద్యుత్ సరఫరా, ఎరువులు, యూ రియా, రైతు భరోసా అందించడంలో పూర్తి గా విఫలమైందని విమర్శించారు. భీమా 26, 27, 28 ఫ్యాకేజీ కాల్వల ద్వారా 20 వేల ఆయకట్టుకు సాగునీరు అందక రైతు లు పంటలు సాగుచేసుకోలేక ఇబ్బందులు పడుతున్న మంత్రి జూపల్లి పట్టించుకోవడంలేదని విమర్శించారు.
కృష్ణానది ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి నీళ్లు తరలించుకపోతుంటే పంట కాల్వలకు ఎందుకు సాగునీరు అందించడంలేదని ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు. రైతులపై ప్రభుత్వాన్నికి చిత్తశుద్ధి లేదని కేవలం ఓటు బ్యాంకు, ఓట్లు వేయించుకునే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ కలేశ్వర్రావు, మండల అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, కరుణాకర్‌రెడ్డి, వేణుమాదవ్రెడ్డి, ముంత మల్ల య్య, రవీందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.