ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలి
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డి మాండ్ చేశారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని ఖండిస్తూ భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీల ను ధరించి ర్యాలీని చేపట్టి మహబూబ్‌నగర్ రో డ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేయాల్కిందే..
- భూత్పూరు ధర్నాలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్, ఆగస్టు 17 : సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డి మాండ్ చేశారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని ఖండిస్తూ భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీల ను ధరించి ర్యాలీని చేపట్టి మహబూబ్‌నగర్ రో డ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే మార్పుగా భావిస్తుందని ఎద్దే వా చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో, బోనస్ ఇవ్వడంలో ప్రజలను పూర్తిగా మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. పేదింటి ఆడపిల్ల పెండ్లికి ప్రభుత్వం ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా వచ్చే రూ. 1,00,016లు ఎంతో మే లే చేస్తాయని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి పథకాన్ని ఎత్తివేయడం దారుణమన్నారు.
అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయం వరకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని కొనసాగించాలని తాసీల్దార్ కిషన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు ఆల శ్రీకాంత్‌రెడ్డి, సురేశ్, కౌన్సిలర్ గడ్డం ప్రేమ్‌కుమార్, మాజీ స ర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, నర్సింహాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నాగయ్య, ఆంజనేయులు, నాయకులు మురళీధర్‌గౌడ్, సత్యనారాయణ, అశోక్, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

