AIYF | చిగురుమామిడి, జూన్ 26 : రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రామండ్లపల్లి యుగంధర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో ఏఐవైఎఫ్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యుగంధర్ హాజరై మాట్లాడుతూ.. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నిరంతరం నిరుద్యోగ సమస్యలు, ఉపాధి అవకాశాలపై ఉద్యమాలు పోరాటం నిర్వహిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని, ఇచ్చిన హామీలు మరిచిపోయిందన్నారు. ఏటాకోటి ఉద్యోగాల మాట నీటి మూటలుగా అయ్యాయన్నారు. కరీంనగర్ ఎంపీ హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమ కూడా తీసుకురావడం లేదన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగులందరికీ అందించాలన్నారు. అర్హులైన వారికి కాకుండా ఇతరులకు అందిస్తే ఏఐవైఎఫ్ చూస్తూ ఊరుకోదని, ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు చెంచల రవి, లక్కిరెడ్డి సురేందర్ రెడ్డి, చెప్యాల శ్రీనివాస్, పైడిపల్లి శశికుమార్, వెంకటేష్, హరీష్, రాజు, తిరుపతి, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి