KTR | మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క.. ఏది ఆ నక్క.. ఎవరు ఆ ముసలి నక్క కాంగ్రెస్.. ఆనాడు 1956లో తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టంలేని బలవంతపు పెళ్లి చేసింది ముసలి నక్క కాంగ్రెస్.. ఆ తర్వాత 1968లో 370 మందిని కాల్చి చంపిన ముసలి నక్క కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే, మా తెలంగాణ మాకు కావాలే అని పోరాటం చేస్తే వాళ్లను గుంజుకొని పోయి కాంగ్రెస్లో కలుపుకుని తెలంగాణ ఇయ్యకుండా వేల మంది ప్రాణాలు బలిగొన్నది కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు.
2004లో ఇదే కరీంనగర్ గడ్డ మీద సోనియా గాంధీ మీ మనసులో ఏముందో నాకు తెలుసు.. తెలంగాణ ఇస్తా అని చెప్తే పొత్తు పెట్టుకున్నం. కానీ పదేండ్లు సతాయించి సావగొట్టి శ్రీకాంత్ చారి లాంటి తమ్ముళ్లు వందల మందిని బలితీసుకుని ఆఖరికి తెలంగాణ ఇయ్యకపోతే వీపు చింతపండు అయితది.. కాంగ్రెసోళ్లు బయట తిరిగే పరిస్థితి ఉండదని.. అప్పుడు కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆనాడు లడాయి చేస్తే దిగివచ్చిన దిక్కుమాలిన ముసలి నక్క కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు.
మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్
1956లో తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టంలేని బలవంతపు పెళ్లి చేసింది ఈ ముసలి నక్కే
1968లో 370 మందిని కాల్చి చంపిన ముసలి నక్క కాంగ్రెస్
1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే, వాళ్లను గుంజుకొని పోయి కాంగ్రెస్లో… pic.twitter.com/ACt1GFNK5O
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
KTR | కేటీఆర్కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు