Rekonda Bridge | చిగురుమామిడి, జులై 8 : ఇరు గ్రామాల రైతులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టకపోవడం పట్ల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో రైతులు రేకొండ గ్రామ శివారులోని ఎగ్లాస్ పూర్ రోడ్డుకు బ్రిడ్జి మంజూరు అయిన ప్రదేశంలో బుధవారం రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఆగస్టు 2023లో అప్పటి ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ రేకొండ నుండి ఎగ్లాస్ పూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణంతోపాటు బ్రిడ్జి ఏర్పాటుకు 2.10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినప్పటికీ, అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టకపోవడంలో అంతర్యం ఏంటని అంజయ్య ప్రశ్నించారు. వచ్చిన నిధులను వేరే పనులకు వినియోగించుకున్నారని ఆరోపించారు. పలుమార్లు స్థానిక మంత్రి దృష్టికి తీసుకు పోవడం జరిగిందన్నారు. వర్షాకాలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. బ్రిడ్జి నిర్మించకపోవడంతో వర్షపు నీటితో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులను మంజూరు చేసి పనులు చేపట్టాలని వారు కోరారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మాజీ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, రైతులు వర్ణ వెంకటరెడ్డి, కల్వల సంపత్ రెడ్డి,ఏరుకొండ తిరుపతి, గాదెపాక నారాయణ, దర్శనం చక్రపాణి, బిళ్ళ సంపత్ రెడ్డి, ఏరుకొండ వెంకటయ్య, పోరండ్ల లక్ష్మారెడ్డి, బిల్ల రవీందర్ రెడ్డి, జున్నూరి కుమార్, ఏరుకొండ తిరుపతి, జున్నూరి రవి, చెంచల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.