గిరిజన విద్యార్థులకు సీనియర్ సిటిజన్స్ చేయూత
తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ కుమార్ మిత్రులు ఎస్.రఘురాం, లలిత (USA) ఆర్థిక సహకారంతో గరిమెళ్లపాడు, చండ్రుకుంట పాఠశాలల్లోని 75 మంది గిరిజన విద్యార్థులకు సుమారు రూ.10 వేల విలువైన నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర విద్యా సామగ్రిని...
చుంచుపల్లి, జూలై 29 : తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ కుమార్ మిత్రులు ఎస్.రఘురాం, లలిత (USA) ఆర్థిక సహకారంతో గరిమెళ్లపాడు, చండ్రుకుంట పాఠశాలల్లోని 75 మంది గిరిజన విద్యార్థులకు సుమారు రూ.10 వేల విలువైన నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర విద్యా సామగ్రిని బుధవారం పంపిణీ చేశారు. అలాగే అంగన్వాడీ చిన్నారులకు పలకలు, బలపాలు అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు, సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ… విద్యార్థులు విద్యా సామగ్రిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అంజనానందం, జోసెఫ్, హెచ్ఎంలు సీతారాములు, కిరణ్మయి, సర్పంచ్ రాము, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

