RTC Bus | రోడ్డుపై ఆగిన ఆర్టీసీ బస్సు.. ధర్నా ఆపి తోసిన ఆశా కార్యకర్తలు.. వీడియో
RTC Bus | మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో బస్సులో ఒకరిద్దరు మాత్రమే పురుషులుండగా.. ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. లేడీ కండక్టర్‌తో కలిసి మహిళలంతా బస్సు తోసిన వీడియోలు కరీంనగర్ డిపోలో ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చెప్పకనే చెబుతున్నాయి.
RTC Bus | తిమ్మాపూర్, సెప్టెంబర్ 9 : ఓ వైపు ఆశావర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డుపై ధర్నా చేస్తున్నారు. మరోవైపు అదే రోడ్డు వెంబడి వస్తున్న ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. కరీంనగర్ డిపో 1కు చెందిన ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా తిమ్మాపూర్ బస్టాండ్‌కు చేరుకునే క్రమంలో ఒక్కసారిగా ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా బస్సు స్టార్ట్ కాలేదు. దీంతో బస్సులో ఉన్న వారంతా కింది దిగారు. ఈ విషయాన్ని గమనించిన ఆశా కార్యకర్తలు తమ ధర్నాను పక్కకు పెట్టి ముందుకొచ్చి బస్సును తోశారు.
అది చూసిన మహిళా ప్రయాణికులు ఆశా కార్యకర్తలతో కలిసి బస్సును ముందుకు తోసి స్టార్ట్ అయ్యేలా చేశారు. ఇటీవల కరీంనగర్ టు హుస్నాబాద్ వెళ్లి వచ్చే బస్సులు తరచూ బ్రేక్ డౌన్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ప్రయాణికులు.. డ్రైవర్, కండక్టర్ అప్రమత్తంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో బస్సులో ఒకరిద్దరు మాత్రమే పురుషులుండగా.. ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. లేడీ కండక్టర్‌తో కలిసి మహిళలంతా బస్సు తోసిన వీడియోలు కరీంనగర్ డిపోలో ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చెప్పకనే చెబుతున్నాయి.
Read Also :
Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు
AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

