Orangutans : కోతి జాతికి చెందిన ఒరాంగ్టన్స్ ఇండియాలో ఉండవు. అలాంటి ఒరాంగ్టన్స్ ఇప్పుడు ఇండియాలో ప్రత్యక్షమయ్యాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఐదు బేబీ ఒరాంగ్టన్స్ను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న నందన్కనాన్ జువాలాజిక్ పార్కుకు బుధవారం వీటిని అధికారులు తరలించారు.
ఇవి మన దేశానికి సంబంధం లేని జీవులు కావడంతోపాటు, పిల్లలు కావడంతో వీటిని జూపార్కులోని సెంటర్ ఫర్ రేరింగ్ యానిమల్ బేబీస్ సెంటర్‌కు తరలించి, ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ ఒరాంగ్టన్స్ ఇండియాకు ఎలా వచ్చాయి అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా వీటిని స్మగ్లింగ్ చేసేందుకు తీసుకొచ్చి, ఇక్కడ వదిలేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇవి ఇండియాలో ఉండవు. మలేసియా, ఇండోనేసియా, బోర్నియో, సుమత్రా దీవుల్లో మాత్రమే ఉంటాయి. అలాంటిది ఒడిశా దాకా ఎలా వచ్చాయనేది సందేహంగానే ఉంది.
ओडिशा के बालासोर से रेस्क्यू किए गए पांच बेबी ओरंगुटान
ओडिशा के बालासोर के जंगलों से रेस्क्यू किए गए पांच बेबी ओरंगुटान को भुवनेश्वर के नंदनकानन जूलॉजिकल पार्क लाया गया है. सभी को सीआरएबी में रखा गया है, जहां अब उनकी देखभाल और परवरिश की जाएगी.#Odisha #Orangutans pic.twitter.com/LpFzcKKXCF
— zingabad (@zingabad) September 9, 2026
ఒరాంగ్టన్స్ను గుర్తించిన బాలాసోర్ అటవీ ప్రాంతం పశ్చిమ బెంగాల్లో, సరిహద్దులో ఉంటుంది. ఇంటర్నేషనల్ వైల్డ్‌లైఫ్ స్మగ్లింగ్ ముఠా వీటిని తీసుకొచ్చినట్లు అనుమానం. అంతర్జాతీయంగా ఒరాంగ్టన్స్కు మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఒరాంగ్టన్ రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఒరాంగ్టన్స్ క్షేమంగా ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇవి పండ్లను, ఆకులను, కీటకాలను, పక్షుల గుడ్లను ఆహారంగా తీసుకుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.