తుంగతుర్తి, సెప్టెంబర్ 09 : తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ విద్యా భారతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ క్రాంతికుమార్ సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అన్ని వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.