న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమానాన్ని హైజాక్ కుట్ర నుంచి తప్పించి, సుమారు 170 ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. దుబాయ్ నుంచి టెల్ అవివ్ విమానం ప్రయాణిస్తున్న సమయంలో .. కాక్‌పిట్‌లో పైలట్ మచ్చర్‌పై కోపైలట్ అటాక్ చేసిన విసయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ధైర్యం కోసం తన మనసులో హనుమాన్ చాలీసా వల్లించినట్లు కెప్టెన్ మచ్చర్ తెలిపారు. 11 ఏళ్లుగా పైలట్‌గా ఉన్నానని, దాడి జరిగిన తర్వాత కింద పడిపోయానని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసు అని, కానీ రియాక్ట్ అయ్యేందుకు కొన్ని సెకన్ల సమయం మాత్రమే ఉందని, ఆ సమయంలో నిరంతరంగా హనుమాన్ చాలీసాను స్మరించానని, కాక్‌పిట్ డోర్‌ను ఓపెన్ చేసేందుకు శక్తిని కూడగట్టుకున్నానని, ఆ తర్వాత ప్రయాణికులు వచ్చినట్లు మోదీతో కెప్టెన్ మచ్చర్ పేర్కొన్నారు.
సౌదీ అరేబియాలోకి తబుక్ విమానాశ్రయంలో ఫ్లైదుబాయ్ ఫ్లయిట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడ మచ్చర్‌కు ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అతన్ని అబూ దాబికి తరలించారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న మచ్చర్‌తో మోదీ మాట్లాడారు. ఆ వీడియో ఫూటేజ్‌ను పీఎంవో రిలీజ్ చేసింది. గుజరాతీ భాషలో స్మిత్‌తో మోదీ మాట్లాడారు. సోమనాథ్, కాశీ క్షేత్రాల్లో త్వరగా కోలుకోవాలని పూజలు చేసినట్లు చెప్పారు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించినట్లు పైలట్‌ను ప్రధాని మెచ్చుకున్నారు.
భారతీయలు ప్రాణాలు తీయరని, భారతీయులు ప్రాణాలు కాపాడుతారని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. కోపైలట్ దాడి చేసిన తర్వాత తాను కేవలం ప్రయాణికుల ప్రాణాల గురించి మాత్రమే ఆలోచన చేసినట్లు స్మిత్ తెలిపాడు. హనుమాన్ చాలీసా ప్రతి రోజు చదువుతుంటానని చెప్పాడు. పేరెంట్స్‌తో మాట్లాడినట్లు మచ్చర్‌తో ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచం నీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉందని, వెల్కమ్ చెప్పేందుకు ఇండియా ఎదురుచూస్తోందని ప్రధాని అన్నారు.
#WATCH | PM Modi speaks with Flydubai Captain Smit Machchhar through a video call and praises his courage, presence of mind and composure in how he saved many lives
The PM says to Captain Smit, “The whole country is praying for you. Maha Mrityunjay Jaap is being done for you and… pic.twitter.com/TCj3NDqASp
— ANI (@ANI) October 2, 2026