హుజురాబాద్, మార్చి 31 : హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ చౌరస్తా వద్దగల రాఘవేంద్ర కిరాణంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. షాపులో గల దాదాపు రూ.20,000తోపాటు కొంత కిరణా సామాను దొంగలు ఎత్తుకెళ్లారు. షెటర్లకు గల తాళాలను పగలగొట్టి షాపులోకి దొంగలు చొరబడ్డారు. సోమవారం ఉదయం యజమాని తుకారం తీసేందుకు రాగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Myanmar | భూకంపం తర్వాత మూడు రోజుల అనంతరం.. శిథిలాల నుంచి సజీవంగా బయటపడ్డ మహిళ