Donald Trump | అణు ఒప్పందం విషయంలో ఇరాన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్.. క్షిపణులతో సిద్ధమైన టెహ్రాన్
Donald Trump | అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఇరాన్ (Iran)కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తన అణు కార్యక్రమంపై వాషింగ్టన్‌తో ఒక ఒప్పందానికి రాకుంటే బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు.
Donald Trump | అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఇరాన్ (Iran)కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తన అణు కార్యక్రమంపై వాషింగ్టన్‌తో ఒక ఒప్పందానికి రాకుంటే బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు. అధ్యక్షుడి హెచ్చరికలతో అప్రమత్తమైన టెహ్రాన్.. క్షిపణులతో (missiles) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా టెహ్రాన్ టైమ్స్ నివేదించింది.
ఆదివారం ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ అణుఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ చూడని రీతిలో దాడులు ఉంటాయి. టెహ్రాన్‌పై మరోసారి సుంకాలు విధిస్తాను’ అని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలతో అప్రమత్తమైన ఇరాన్.. దేశవ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్ప్యాడ్లపై సిద్ధంగా ఉంచినట్లు టెమ్రాన్ టైమ్స్ వెల్లడించింది. వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశాలున్నట్లు తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు ఈ క్షిపణులను ఉపయోగించే ప్రణాళిక ఉందని సదరు కథనం పేర్కొంది.
2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దు
ట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో ఇరాన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగించారు. ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా 2018లో రద్దు చేశారు. అప్పటి నుంచి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతన్నాయి. ఆ తర్వాత ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఆ తర్వాత అనేక సంవత్సరాలుగా పరోక్ష చర్చలు ఫలించకపోవడంతో.. ఇటీవల ట్రంప్ మళ్లీ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. కానీ, ఈ విషయంలో ఇరాన్ వైఖరి యథాతథంగా కొనసాగుతుండటం ఉద్రిక్తతలకు తెరపడటం లేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు.
Also Read..
Betting Apps | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్.. 90 రోజుల్లో నివేదిక అందజేయాలన్న డీజీపీ
Time Travel | పాత అందాల్లోకి ప్రయాణం.. టైమ్ ట్రావెల్ ఫీచర్ తెచ్చిన గూగుల్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Donald Trump
- iran
- missiles
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

