e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జనగాం ఉద్యోగాల భర్తీలో కేంద్రం విఫలం

ఉద్యోగాల భర్తీలో కేంద్రం విఫలం

  • రాష్ట్రంలో 1.30లక్షల కొలువులు భర్తీ చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
  • పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • వర్ధన్నపేట, ఐనవోలులో లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డుల పంపిణీ

వర్ధన్నపేట, జూలై 27 : ఏటా దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కట్య్రాల శివారు కల్యాణలక్ష్మి ఫంక్షన్‌హాల్‌లో పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలకు చెందిన 1,056 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావుతో కలిసి మంత్రి రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్‌ అనేక సవాళ్లను ఎదుర్కొని, రైతులకు సాగునీటిని అందించడంతో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, అవి చేపట్టకపోగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ కంపెనీలకు విక్రయిస్తోందని ఆరోపించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు మరో 50వేల కొలువులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలు ఆగకుండా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు ఆహార భద్రత కల్పించేలా కొత్తగా రేషన్‌ కార్డులను మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని 5,740 మందికి కొత్తగా రేషన్‌కార్డులు మంజూరైనట్లు మంత్రి దయాకర్‌రావు వివరించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని పేదలందరికీ రేషన్‌కార్డులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భూక్యా హరిసింగ్‌, వర్ధన్నపేట, పర్వతగిరి ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, కమల, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్‌ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్‌ఖన్నా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ అరుణ పాల్గొన్నారు.

- Advertisement -

ఐనవోలు మండలంలో..
ఐనవోలు : మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్‌ బొనగాని రాజేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై మాట్లాడారు. ఐనవోలు మండల వ్యాప్తంగా 225 మందికి కొత్త రేషన్‌కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్‌ కృషితోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందన్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం కూడా చరిత్ర కలిగినదేనన్నారు. మార్నేని రవీందర్‌రావు కోరిక మేరకు మల్లన్న ఆలయం గురించి కూడా టూరి జం వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మండలంలో పోలీస్‌స్టేషన్‌, తహసీల్దార్‌, ఎంపీడీవో, మహిళా భవనాలను విడుతల వారీగా నిర్మిస్తామన్నారు. కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ ఉస్మాన్‌ అలీ, ఆలయ కమి టీ చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌, ఏసీపీ నరేశ్‌కుమార్‌, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ మజ్జిగ జయపాల్‌, సర్పంచ్‌ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పనా మధుకర్‌, కార్పొరేటర్‌ అనితా రంజిత్‌రావు, మండల కోఆప్షన్‌ మెంబర్‌ గుంషావలీ, ఎంపీడీవో వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana