ఆదివారం 24 జనవరి 2021
Jangaon - Aug 10, 2020 , 00:29:35

రైతువేదికలను పూర్తిచేయాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

రైతువేదికలను  పూర్తిచేయాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

తరిగొప్పుల, ఆగస్టు 9 : రైతువేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి అధికారులను కోరారు. ఆదివారం ఆయన నర్మెట మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని సంత ప్రదేశంలో రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తిచేసి రైతులకు ఉపయోగపడేవిధంగా చూడాలని కాంట్రాక్టర్‌ను ముత్తిరెడ్డి అదేశించారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయని అన్నారు. దీనిని ప్రతిక్షపార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతు రాజ్యంతేవడమే కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. రైతుల సౌకర్యార్థమే ఇక్కడ రైతు వేదిక స్థలం మార్పు చేశామని, పాత స్థలంలో రైతులకు ఉపయోగపడే ధాన్యం గోదాములు నిర్మించడానికి కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేజవత్‌ గోవర్ధన్‌, జడ్పీటీసీ మాలోత్‌ శ్రీనునాయక్‌, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నీరటి సుధాకర్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ చింతకింది సురేశ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అమెడపు కమలాకర్‌రెడ్డి, జడ్పీకోఆప్షన్‌ సభ్యుడు ఎండీ గౌస్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి, నాయకులు కొన్నె చంద్రయ్య పాల్గొన్నారు. logo