న్యూఢిల్లీ, మే 8: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్ లాభాల్లోనూ దూకుడును ప్రదర్శించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.943.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.810.8 కోట్ల లాభం కంటే 16.7 శాతం అధికం.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.8,434.28 కోట్ల నుంచి రూ. 9,616.68 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. అలాగే నిర్వహణ ఖర్చులు కూడా రూ.7,508.94 కోట్ల నుంచి రూ. 8,427.36 కోట్లకు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.37,788.62 కోట్ల ఆదాయంపై రూ.3,742.16 కోట్ల లాభాన్ని గడించింది. అలాగే రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.40 తుడి డివిడెండ్‌ను ప్రకటించింది. వచ్చే పండుగ సీజన్లో పలు మాడళ్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నది.