Viral video : పట్టుకుంటే చేతిలోంచి సర్రున జారిపోయే అరుదైన చేప మెక్సికో (Mexico) లోని పసిఫిక్ తీరంలో కనిపించింది. ఈ చేప పాములా పొడవుగా ఉంటుంది. దేహంపై ఆరెంజ్ రంగులో వాజాలు ఉంటాయి. ఈ చేపను ‘డూమ్స్ డే ఫిష్ (Dooms Day Fish)’ అని కూడా అంటారు. డూమ్స్ డే అంటే ‘ప్రళయ దినం’ అని అర్థమట. ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించబోయే ముందు ఈ చేప తీరప్రాంతం (Ashore) లో కనిపిస్తుందట.
జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను ‘మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ (Messenger of The Sea God)’ అంటారట. అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందట. 2011లో జపాన్‌లో సముద్రంలోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడటానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు 20 తీర ప్రాంతంలో కనిపించాయట. ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించిన దృశ్యాలను ఫియర్బక్ (FearBuk) అనే ఎక్స్ యూజర్ షేర్ చేశాడు.
A deep-sea creature rarely seen by humans called the oarfish has washed ashore in Mexico!
Legend has it that this mysterious “doomsday fish” only emerges from the ocean’s depths when disaster is near 👀
pic.twitter.com/NciJ7jbEbo— FearBuck (@FearedBuck) February 18, 2025
ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ‘ఈ మధ్య కాలంలో ఇలాంటి చేపలు బీచ్‌లలో చాలా కనిపిస్తున్నాయి. అంటే దానర్థం డూమ్స్ డే x 3 రాబోతోందని అర్థమా..?’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘సముద్రం అడుగు భాగంలో ఏం జరుగుతోంది. అడుగు భాగంలో ఉండే ఈ అరుదైన చేపలు అకస్మాత్తుగా తీరంలోకి ఎందుకు వచ్చాయి..?’ అని మరో నెటిజన్ సందేహం వ్యక్తం చేశాడు.
సముద్రం అడుగులో ఉండే చేపలు జబ్బు పడినప్పుడు, మరణించినప్పుడు తీరానికి కొట్టుకొస్తాయని, అది సాధారణ విషయమేనని మరో యూజర్ లైట్ తీసుకున్నాడు. అదేవిధంగా నిపుణులు కూడా ఇదే విషయం చెప్పారు. డూమ్స్ డే ఫిష్ తీరాల్లో కనిపించినప్పుడల్లా అది రాబోయే ప్రళయానికి సంకేతంగా భావించలేమని, సముద్రంలో అడుగులో ఎల్‌నినో, లానినో లాంటి పరిస్థితులు సంభవించినా, నీటి ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పు వచ్చినా, గాయపడినా, జబ్బుపడినా ఈ చేపలు తీరానికి వస్తాయని పేర్కొన్నారు.
కాగా, ఫ్లోరిడాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం వారు తెలిపిన ప్రకారం.. అరుదైన డూమ్స్ డే ఫిష్ 36 అడుగుల పొడవు వరకు పెరుగుతుందట. ఇవి సముద్ర ఉపరితలానికి కిలోమీటర్ లోతు వరకు వెళ్తాయట. ఎక్కువగా మాత్రం 200 మీటర్ల లోతులో కనిపిస్తాయట.
Viral news | నోటీస్ పీరియడ్‌లో రెండు లీవులు.. ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ..!
Road accident | కుంభమేళాకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
Delhi Assembly | ఈ నెల 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు కాగ్ రిపోర్ట్.. ఆ రిపోర్టులో ఏముంది..?
Jagadish Reddy | ఏపీ నీటి దోపిడీతో.. తెలంగాణలో సాగు, తాగు నీళ్లకు కటకట: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Daaku Maharaaj OTT | ఓటీటీలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Nandini Milk | వినియోగదారులకు షాక్.. పాల ధరల పెంపుకు కేఎమ్ఎఫ్ ప్రతిపాదన.. లీటరుపై ఎంతంటే..?