Viral news : రెడిట్ (Reddit) అనేది ఒక ఫేమస్ సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్. ఉద్యోగులు తమ ఉద్యోగానికి సంబంధించిన సమస్యల (Struggles) ను, ఆఫీస్ అనుభవాల (office experiences) ను, పని ప్రదేశంలో ఆందోళనల (workplace concerns) ను పంచుకోవడానికి ఇది మంచి వేదిక. ఉద్యోగులు తమకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికి, సలహాలు తీసుకోవడానికి, తమలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న ఇతరులతో చర్చించి పరిష్కారాలు కనుగొనడానికి ఈ రెడిట్ ప్లాట్‌ఫామ్ మంచి అవకాశం.
తాజాగా ఓ రెడిట్ యూజర్ తాను పనిచేసే కంపెనీ నుంచి తనకు ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని గురించి రెడిట్‌లో పంచుకున్నారు. నోటీస్ పీరియడ్‌లో రెండు లీవులు తీసుకున్నానన్న కారణంతో తనను ఉద్యోగం నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగించిందని, తనకు రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి నిరాకరించిందని అతను oreki791 పేరుతో ఉన్న రెడిట్ హ్యాండిల్లో పేర్కొన్నారు. విషపూరితమైన పని వాతావరణం, ఎలాంటి అదనపు ప్రతిఫలం ఇవ్వకుండా అదనపు పని గంటలు పని చేయించుకోవడం లాంటి కారణాలవల్ల ఉద్యోగంలో చేరిన రెండు నెలలకే మానేయాలని నిర్ణయం తీసుకున్నానని, ఈ క్రమంలో నోటీస్ పీరియడ్‌లో ఉన్న తనను కంపెనీ అనూహ్య రీతిలో తొలగించిందని సదరు యూజర్ రెడిట్‌లో చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు కొత్త కంపెనీలో ఎక్కువ జీతం కావాలంటే నాకు రిలీవింగ్ లెటర్ కావాలని, అందుకోసం తాను ఏం చేయాలని అతను తన పోస్టులో ప్రశ్నించాడు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. పలువురు తమ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 50 వేల రూపాయలు ఖర్చైనా సరే మంచి లాయర్‌ను పెట్టుకుని కంపెనీతో ఫైట్ చేయాలని ఓ యూజర్ సూచించాడు. పని చేసింది రెండు నెలలే కాబట్టి రిలీవింగ్ లెటర్ అక్కర్లేదని మరో యూజర్ పేర్కొన్నాడు.
చేరిన కొన్ని రోజులకే రిజైన్ చేశావుగా.. ఆ కంపెనీ రిలీవింగ్ లెటర్ నీకెందుకు..? అని ఇంకో యూజర్ ప్రశ్నించాడు. ఆ లెటర్‌తో నీకు నష్టమే తప్ప లాభం ఉండదని పేర్కొన్నాడు. సదరు కంపెనీ నుంచి నీ పీఎఫ్ ఖాతాలో ఎంట్రీలు ఉన్నట్లయితే రిలీవింగ్ లెటర్ అవసరమని, లేదంటే లైట్ తీసుకోవచ్చని ఇంకో యూజర్ సలహా ఇచ్చాడు.
Road accident | కుంభమేళాకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
Delhi Assembly | ఈ నెల 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు కాగ్ రిపోర్ట్.. ఆ రిపోర్టులో ఏముంది..?
Jagadish Reddy | ఏపీ నీటి దోపిడీతో.. తెలంగాణలో సాగు, తాగు నీళ్లకు కటకట: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Daaku Maharaaj OTT | ఓటీటీలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Nandini Milk | వినియోగదారులకు షాక్.. పాల ధరల పెంపుకు కేఎమ్ఎఫ్ ప్రతిపాదన.. లీటరుపై ఎంతంటే..?