(Todya History) ఎంతో వినాశనాన్ని మిగిల్చిన మొదటి ప్రపంచ యుద్ధం 1918 లో సరిగ్గా ఇదే రోజున ముగిసింది. ఈ యుద్ధం 1914 జూన్ 28 న ప్రారంభమై దాదాపు నాలుగేండ్ల పాటు కొనసాగింది. ఈ యుద్ధంలో దాదాపు 85.28 లక్షల మంది చనిపోయినట్లు.. 2.18 కోట్ల మంది గాయపడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అలాగే, 77.50 లక్షల మంది గల్లంతు కాగా, మొత్తం 3.74 కోట్ల మంది నష్టపోయినట్లు లెక్కల ద్వారా తెలుస్తున్నది. ఈ యుద్ధాన్ని ఆధునిక చరిత్రలో గ్లోబల్ మహాభారత యుద్ధంగా పరిగణిస్తారు.
ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఆస్ట్రియా-హంగేరీ సామ్రాజ్యం క్రౌన్ ప్రిన్స్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య. ఫెర్డినాండ్ తన భార్య సోఫీతో కలిసి బోస్నియాను సందర్శిస్తున్న సమయంలో అతను దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యతో ఆస్ట్రియా రాజ కుటుంబం ఉలిక్కిపడింది. హత్యలో సెర్బియా కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రియా-హంగేరీ చక్రవర్తి ఫ్రాంట్జ్ జోసెఫ్ 1914 జూలై 28 న సెర్బియాపై యుద్ధం ప్రకటించాడు.
ఈ మహా యుద్ధంలో బ్రిటన్ తరపున లక్షలాది మంది భారత సైనికులు సైతం పాలుపంచుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం రోజుల్లో మధ్యప్రాచ్యానికి పంపబడిన భారతీయ సైనికుల్లో 60 శాతం మెసొపొటేమియాలో (ప్రస్తుత ఇరాక్), 10 శాతం ఈజిప్ట్, పాలస్తీనాలో పోరాడారు. ఈ దేశాలలో మనవాళ్లు చాలా మంది వివిధ వ్యాధులకు గురై మరణించారు.
2004: పాకిస్తాన్‌తో శాంతి ప్రక్రియలో భాగంగా కశ్మీర్లో సైనికులను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మన్మోహన్ సింగ్
2002: భారతదేశంలో ఎయిడ్స్‌పై పోరాటానికి దన్నుగా 100 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించిన బిల్ గేట్స్
1982: ఇజ్రాయెల్ సైనిక ప్రధాన కార్యాలయంలో గ్యాస్ పేలుడులో 60 మంది దుర్మరణం
1975: పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందిన అంగోలా
1966: అంతరిక్ష నౌక ‘జెమినీ-12’ను ప్రయోగించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా
1918: స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న పోలాండ్
1888: స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సౌదీ అరేబియాలో జననం
1836: బొలీవియా, పెరూపై యుద్ధం ప్రకటించిన చిలీ
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..