New cool fabric : ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
New cool fabric : ప్రపంచంలోని మొట్టమొదటి అతి చల్లగా ఉంచే పట్టు వస్త్రాన్ని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ వస్త్రం పత్తి కంటే చల్లగా ఉంచుతుంది. వేసవిలో ఉష్ణోగ్రతను...

(New cool fabric) ప్రపంచంలోని మొట్టమొదటి అతి చల్లగా ఉంచే పట్టు వస్త్రాన్ని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ వస్త్రం పత్తి కంటే చల్లగా ఉంచుతుంది. వేసవిలో ఉష్ణోగ్రతను 12.5 డిగ్రీలను తగ్గిస్తుందని పరిశోధకులు సెలవిస్తున్నారు. ఇది కచ్చితంగా వేసవి నుంచి ఉపశమనం కలిగిస్తుందని దీమాగా చెప్తున్నారు.
ఈ ఫ్యాబ్రిక్‌ను చైనాలోని నాన్జింగ్ యూనివర్సిటీ పరిశోధకులు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన షాన్హుయ్ ఫ్యాన్ సంయుక్తంగా తయారు చేశారు. వేసవి కాలంలో బయటకు వెళ్లినప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచేలా ఈ ఫ్యాబ్రిక్‌ని డిజైన్ చేసినట్టు పరిశోధకులు చెప్తున్నారు.
ఈ కొత్త పట్టు వస్త్రం సాయంతో విద్యుత్ డిమాండ్‌ను కొంతమేర తగ్గించుకోవచ్చు. దీని వల్ల కరెంటు లేకుండానే శరీరాన్ని చల్లగా ఉంచుకొనే వీలుంటుంది. సూర్యకిరణాలు 95 శాతం వరకు ప్రతిబింబించేలా ఈ ఫ్యాబ్రిక్‌ను తయారు చేసినట్టు పరిశోధకులు చెప్తున్నారు. వీరి పరిశోధన ప్రకారం, ఈ వస్త్రం సూర్యకిరణాలను ఎక్కువగా ప్రతిబింబించేలా చేస్తుంది. అలాగే అతి తక్కువగా వేడిని గ్రహిస్తుంది. సూర్యకాంతి ప్రభావాల నుంచి ఈ ఫ్యాబ్రిక్ మన శరీరాన్ని కాపాడటమే కాకుండా, చల్లగా ఉంచుతుంది.
గాలి కంటే చల్లగా..
ఈ పట్టు వస్త్రాన్ని ఎండలో పరీక్షించినప్పుడు, చుట్టుపక్కల గాలి కంటే ఇది 3.5 శాతం వరకు చల్లగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. గాలి కంటే చల్లగా ఉండే ఇలాంటి ఫ్యాబ్రిక్ ప్రపంచంలో ఇదే మొదటిదని పరిశోధకులు చెప్తున్నారు.
పరిశోధన నివేదిక ప్రకారం, ఈ ఫ్యాబ్రిక్‌లో అల్యూమినియం ఆక్సైడ్ నానో పార్టికల్స్ కలిపారు. ఇది అతినీలలోహిత కిరణాలను ప్రతిబింబించేలా చేసి శరీరం నుంచి దూరంగా ఉంచుతుంది. ఈ ప్రత్యేక రకం పట్టు వస్త్రాన్ని ధరించి 40 డిగ్రీల సెల్సియస్ ఎండలో నిలబడితే, అది 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుభూతిని కలిగిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

