PM Modi | భారత్‌పై అగ్రరాజ్యం అమెరికా అధిక టారిఫ్‌ల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వచ్చే నెల యూఎస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి ట్రంప్-మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. అంతేకాదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురు విదేశీ నేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలిసింది.
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. హై లెవల్ డిబేట్ మాత్రం సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరగనున్నది. చర్చలో పాల్గొనే వక్తల జాబితాను తాజాగా యూఎన్ రిలీజ్ చేసింది. ఆ లిస్ట్‌లో భారత ప్రధాని మోదీ పేరు ఉంది. దీంతో ఆయన యూఎస్ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత బ్రెజిల్ చర్చను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అమెరికా మాట్లాడుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన యూఎన్జీఏ పోడియం నుంచి డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 26వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని ఆ జాబితాలో ఉంది. అదే రోజున ఇజ్రాయిల్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నేతలు కూడా ప్రసంగిస్తారు.
Also Read..
PM Modi: యూఎన్‌లో ప్రసంగించనున్న మోదీ.. సెప్టెంబర్‌లో అమెరికా ట్రిప్
Dead Body | మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన మార్చురీ అసిస్టెంట్, పోలీసు
Pakistan Spy: పాక్‌కు సమాచారం చేరవేస్తున్న డీఆర్డీవో గెస్ట్ హౌజ్ మేనేజర్ అరెస్టు