Samuthirakani | తమిళ నటులు, దర్శకులు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. ఈ సినిమాకు రామ్ చక్రి దర్శకత్వం వహిస్తుండగా.. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 3, 2026న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ సినిమాకు థియేట్రికల్ పార్ట్నర్గా వ్యవహరిస్తుండటంతో, దేశవ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరిగే ఈ కథ, ఆధునిక సమాజంలోని ఒత్తిళ్లు మరియు నిజాయితీగా బతకాలనుకునే మనిషి చేసే పోరాటాన్ని కళ్లకు కట్టేలా చూపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రానికి విభిన్నమైన మ్యూజిక్ టెక్నాలజీ (MAAS) ద్వారా సంగీతాన్ని అందిస్తున్నారు. సామాన్యుడి మనసులోని మాటగా మొదలై హై-స్టేక్స్ డ్రామాగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు రామ్ చక్రి ఆశాభావం వ్యక్తం చేశారు.