జైపూర్: పాకిస్థాన్ గూఢచారి(Pakistan Spy)గా పనిచేస్తున్న 32 ఏళ్ల మహేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో అరెస్టు చేశారు. అతన్ని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఉన్న డీఆర్డీవో గెస్ట్ హౌజ్‌లో అతను మేనేజర్‌గా చేస్తున్నాడు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వ్యక్తులతో అతను నిత్యం టచ్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారతీయ రక్షణ రంగ కార్యకలాపాల గురించి సున్నితమైన సమాచారాన్ని అతను చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా అతని స్వస్థలం. సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్‌తో అతనికి లింకు ఉన్నట్లు గుర్తించారు. డీఆర్డీవో సైంటిస్టులు కదలికల గురించి, చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు వస్తున్న భారత ఆర్మీ ఆఫీసర్ల వివరాలను పాక్ ఇంటెలిజెన్స్‌తో అతను పంచుకున్నట్లు తెలుస్తోంది. జైసల్మేర్‌లో ఉన్న కేంద్రంలో రక్షణ రంగ ఈక్విప్‌మెంట్‌ను పరీక్షిస్తుంటారు. భద్రతా ఏజెన్సీలు ప్రసాద్‌ను విచారిస్తున్నాయి. అతని మొబైల్ ఫోన్‌ను సాంకేతిక విశ్లేషణ కోసం వినియోగిస్తున్నారు.
డీఆర్డీవో ఆపరేన్స్కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని అతను షేర్ చేసినట్లు ద్రువీకరించారు. గూఢచర్యం కేసు కింద ప్రసాద్‌ను సీఐడీ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది.