అగ్ర నటుడు వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం ఏకే 47’ అనే పేరుతో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగుతోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమ్మర్లోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారట.
ఇదిలావుంటే.. ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. రెండు భిన్నకోణాల్లో ఈ కథ సాగుతుందట. తొలి భాగమంతా కుటుంబ భావోద్వేగాలు, త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్‌తో సాగుతుందట. అయితే.. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్ కథ దిశను పూర్తిగా మార్చి యాక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్తుందట. అంటే.. అటు ఫ్యామిలీ ఆడియన్స్‌కీ, ఇటు మాస్ ప్రేక్షకులకూ నచ్చే కథ, కథనాలు ఉంటాయన్నమాట. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం ఈ కథకు ప్రధాన బలం అవుతుందని ప్రత్యేకంగా చెబుతున్నారు.