ICC T20 Rankings : అంతర్జాతీయ టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో వైట్‌వాష్‌తో రెండుకు పడిపోయిన టీమిండియా.. రెండో టీ20లో జింబాబ్వే (Zimbabwe)పై అదిరే విజయంతో నంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకుంది. వరసగా రెండు సిరీస్‌లలో ఓటమితో విమర్శలపాలైన శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) సేన ఆఫ్రికా జట్టుపై గొప్పగా ఆడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో గేమ్ ఉండగానే సిరీస్ గెలుపొంది ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టేసింది.
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్ భారత జట్టు మళ్లీ నంబర్ 1 ర్యాంకకు ఎగబాకింది. ఇంగ్లండ్ పర్యటనలో క్లీన్‌స్వీప్ నుంచి తేరుకున్న టీమిండియా హరారే స్పోర్ట్స్ క్లబ్లో జింబాబ్వేను వరసగా రెండు మ్యాచుల్లో చిత్తు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
Back on top! 🔝
After slipping to No. 2 following a winless UK tour, India have reclaimed the No. 1 spot in the ICC Men’s T20I rankings 🇮🇳 pic.twitter.com/EmDnnnr95j
— Cricinfo (@cricinfo) July 26, 2026
భారత టీ20 సారథిగా శ్రేయాస్ అయ్యర్ మొట్టమొదటి సిరీస్ విజయం సాధించగా.. హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ రెండో ర్యాంకుకు పడిపోయింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో16,088 పాయింట్లు.. ఇంగ్లండ్ పేరిట 10,186 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.
1. భారత్ – 16,088 పాయింట్లు, 268 రేటింగ్
2. ఇంగ్లండ్ – 10,186 పాయింట్లు, 268 రేటింగ్
3. ఆస్ట్రేలియా – 9,868 పాయింట్లు, 260 రేటింగ్
4. న్యూజిలాండ్ – 12,348 పాయింట్లు, 247 రేటింగ్
5. దక్షిణాఫ్రికా – 11,717 పాయింట్లు, 244 రేటింగ్