Prahlad Joshi : తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి (Education Minister) గా నియమితులైన ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఎంతో వినయంతో ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కి ధన్యవాదాలు తెలిపారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించిన ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటకకు చెందిన ప్రహ్లాద్ జోషి.. ధార్వాడ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. ఇవాళ్టి నుంచి విద్యా శాఖ అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు.