IND vs ZIM | క్లీన్‌స్వీప్ లక్ష్యంగా టీమిండియా.. ప్రిన్స్, దూబే ఔట్..!
IND vs ZIM : ఆదివారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న ఆఖరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
IND vs ZIM : జింబాబ్వేపై వరసగా రెండు విజయాలో టీ20 సిరీస్ పట్టేసిన భారత జట్టు క్లీన్‌స్వీప్ లక్ష్యంగా మూడో మ్యాచ్ ఆడుతోంది. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆతిథ్య జట్టు పట్టుదలతో ఉంది. ఆదివారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న ఆఖరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. తుది జట్టులో రెండు మార్పులు చేశామని అయ్యర్, తాము ఒక మార్పుతో ఆడుతున్నామని జింబాబ్వే సారథి సికిందర్ రజా చెప్పారు.
తొలి రెండు టీ20ల్లో అదిరే విజయం సాధించిన భారత జట్టు వైట్‌వాష్‌పై కన్నేసింది. స్వదేశంలో టీమిండియా ధాటికి తడబడుతున్న జింబాబ్వే ఎలాగైనా విజయంతో మురవాలనే కసితో ఉంది. దాంతో సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లోనైనా ఆతిథ్య జట్టు పోటీ ఇస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. భారత తుది జట్టులో.. సూర్యాన్ష్ షెడ్డే, అశోక్ శర్మకు చోటు దక్కింది. గాయపడిన నగవరా స్థానంలో వెల్లింగ్టన్ మసకజ్దను తీసుకున్నామని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తెలిపాడు.
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bat first in the 3️⃣rd T20I.
Updates ▶️ https://t.co/oApMpI6eRc#ZIMvIND pic.twitter.com/RrHYunuvT4
— BCCI (@BCCI) July 26, 2026
జింబాబ్వే తుది జట్టు : బ్రియన్ బెన్నెట్, తడివనషె మరుమణి(వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియాన్ మయెర్స్, సికిందర్ రజా(కెప్టెన్), రియాన్ బురి, వెస్లీ మధీవరె, బ్రాడ్ ఎవాన్స్, న్యూమన్ న్యహుమ్రి, వెల్లింగ్టన్ మసకజ్ద, బ్లెస్సింగ్ ముజరబని.
భారత తుది జట్టు : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాన్ష్ షెడ్గే, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

