Current Supply | హనుమకొండ : ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ వద్ద ఉన్న వినియోగదారులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు.. పున్నెల్ క్రాస్ ఏరియా సగం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని సబ్ స్టేషన్ పరిధిలో మరో సగం వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలో బొల్లికుంట సబ్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.. రెండు జిల్లాల పరిధికి రావడంతో రెండు ఏరియాల చెందిన ఏ అధికారులు వినియోగదారుల కరెంట్ కష్టాలను పట్టించుకొనే వారే లేకుండా పోయారు. ఈ ఏరియాలో ప్రతి రోజు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమా లేక సమన్వయ లోపమా..? కానీ ప్రతి రోజు ఖచ్చితంగా సుమారుగా 3 నుంచి 4 గంటల కరెంట్ కట్టింగులు భరించాల్సిందే.
ఈ కరెంట్ కట్టింగులతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కవేళ రాత్రి కరెంట్ పోతే ఇక అంతే తెల్లవారు వరకు వినియోగదారులు కరెంట్ రాక కోసం నిద్రపోకుండా పడికాపులు గాయాల్సిందే. ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు సబ్ స్టేషన్ వద్ద ఏదో సాంకేతిక లోపాలతో కరెంట్ పోయి మధ్యాహ్నం 3 దాటినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ కరెంటు కోతలు లేని విద్యుత్‌ను అందించాలని కోరుతున్నారు.