నటుడిగా, దర్శకుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు తరుణ్‌భాస్కర్. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కల్యాణం’. నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధారులు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
బుధవారం హోలి పర్వదినాన్ని పురస్కరించుకొని బాల్‌రాజ్ పాత్రలో తరుణ్‌భాస్కర్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆయన సూపర్‌మ్యాన్ ైస్టెల్ గెటప్‌లో జోష్‌గా కనిపిస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే వినోదాత్మక కథ ఇదని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బద్రప్ప గాజుల.