జాఫ్నా : (one nation one law) శ్రీలంకలో ‘ఒక దేశం-ఒకే చట్టం’ అనే చర్చ ముందుకు పడింది. దీనిపై సలహాలు, సూచనలు చేసేందుకు 13 మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ను శ్రీలంక దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్స నియమించారు. ఈ బృందానికి బౌద్ధ సన్యాసి గల్గోడ అత్తే జ్ఞాన్సార్ నేతృత్వం వహించనున్నారు. జ్ఞాన్సార్ నేతృత్వంలోని ఈ టాస్క్‌ఫోర్స్‌లో నలుగురు ముస్లిం పండితులు కూడా సభ్యులుగా ఉన్నారు. అయితే, మైనారిటీ తమిళులకు ప్రాతినిధ్యం కల్పించలేదు.
మెజారిటీ బౌద్ధ సమాజం మద్దతుతో 2019 లో రాజపక్సే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ ఎన్నికల్లో ‘ఒకే దేశం-ఒకే చట్టం’ అనే నినాదం ఎత్తుకుని ముందుకు సాగారు. శ్రీలంకలో నానాటికి పెరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మెజారిటీ సింహళీయుల మద్దతును పొందేందుకు ‘ఒకే దేశం-ఒకే చట్టం’ అనే భావనను పాలక శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్పీపీ) ప్రచారం చేసింది. దేశంలో షరియా చట్టాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలను జాతీయవాద సంఘాలు వ్యతిరేకించాయి. ఇది ముస్లిం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నాయి.
మంగళవారం విడుదల చేసిన గెజిట్ ప్రకారం.. ‘ఒకే దేశం-ఒకే చట్టం’ భావన అమలుకు సంబంధించిన ముసాయిదాను రూపొందించే బాధ్యతను ఈ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. ఈ టాస్క్‌ఫోర్స్ నెలవారీ పురోగతి నివేదికలను అధ్యక్షుడు రాజపక్సేకు సమర్పిస్తుంది. టాస్క్‌ఫోర్స్ తన తుది నివేదికను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి సమర్పించనున్నది.
తండా నుంచి డాక్టరేట్ వరకు.. ఉద్యమ కెరటం శంకర్‌నాయక్
పెగాసస్ కేసులో ‘సుప్రీం’ ఆదేశాలు భేష్..! పార్లమెంట్లో చర్చించాల్సిందే : రాహుల్‌గాంధీ
ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
షోయాబ్ అక్తర్‌కు అవమానం.. లైవ్ షో నుంచి వెళ్లిపొమ్మన్న హోస్ట్.. ఎందుకంటే?
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
రామ్‌దేవ్ బాబాకు ఢిల్లీ కోర్టు సమన్లు
బ్రిటన్‌లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా చేయూత.. 300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఇంకా 450 మంది అమెరికన్లు.. పెంటగాన్ వెల్లడి
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..