Rahul Gandhi : పెగాసస్ కేసులో ‘సుప్రీం’ ఆదేశాలు భేష్..! పార్లమెంట్లో చర్చించాల్సిందే : రాహుల్‌గాంధీ
Rahul Gandhi : పెగాసస్ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ అంశాన్ని...

న్యూఢిల్లీ : (Rahul Gandhi) పెగాసస్ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. మొన్నటి సమావేశాల్లో పెగాసస్ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని, పెగాసస్‌ని ఎవరు కొనుగోలు చేశారనే ప్రశ్నలడిగినట్లు తెలిపారు. ‘ఏ ప్రైవేట్ పార్టీ దానిని కొనుగోలు చేయదు. ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేయగలదు. ఎవరి మీద వాడారు? పెగాసస్ డాటా మరేదైనా దేశంలో ఉందా? లేదా అది భారత ప్రభుత్వం వద్దనే ఉందా? అని అడిగాం. ఇంతవరకు మాకు సమాధానం రాలేదు. ఇది దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’ అని రాహుల్ వెల్లడించారు.
పెగాసస్ అంశాన్ని మళ్లీ పార్లమెంటులో లేవనెత్తుతామని రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంటులో చర్చకు ప్రయత్నిస్తామన్నారు. దీనిపై చర్చకు బీజేపీ ఇష్టపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానులు, బీజేపీ మంత్రులు తదితరులపై పెగాసస్‌ను ఉపయోగించారని ఆయన చెప్పారు. డాటాను పొందడానికి పెగాసస్ ఉపయోగించినట్లయితే అది నేరపూరిత చర్య అని పేర్కొన్నారు. ఇలాఉండగా, పెగాసస్ వినియోగంపై విచారణకు సుప్రీంకోర్టు బుధవారం ముగ్గురు సభ్యుల సైబర్ నిపుణుల ప్యానెల్‌ను నియమించింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ పర్యవేక్షణలో త్రిసభ్య కమిటీ త్వరితగతిన ఆరోపణలను పరిశీలించి నివేదిక సమర్పించాలని సీజేఐ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. టెక్నికల్ కమిటీలో డాక్టర్ నవీన్ కుమార్ చౌదరి, డాక్టర్ చర్హాన్ పీ, డాక్టర్ అశ్విన్ అనిల్ గుమాస్తే ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
షోయాబ్ అక్తర్‌కు అవమానం.. లైవ్ షో నుంచి వెళ్లిపొమ్మన్న హోస్ట్.. ఎందుకంటే?
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
రామ్‌దేవ్ బాబాకు ఢిల్లీ కోర్టు సమన్లు
బ్రిటన్‌లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా చేయూత.. 300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఇంకా 450 మంది అమెరికన్లు.. పెంటగాన్ వెల్లడి
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

