శ్రమ దినాల్లో.. క్రీస్తు సందేశం
క్రైస్తవులంతా ప్రస్తుతం శ్రమదినాలు పాటిస్తున్నారు. పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండటం, ప్రార్థనా నియమం పాటించడం, చేసిన వాటికి పశ్చాత్తాపం చెందడం, దాన కృత్యాలు చేయడం ఇత్యాది కార్యకలాపాలతో ఈ శ్రమదినాలు పరిపూర్ణమైపోతాయా? మొదటి మూడూ వ్యక్తిగత విషయాలు. ఉపవాసం వల్ల వేరెవరికీ ప్రయోజనం లేదు.
క్రైస్తవులంతా ప్రస్తుతం శ్రమదినాలు పాటిస్తున్నారు. పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండటం, ప్రార్థనా నియమం పాటించడం, చేసిన వాటికి పశ్చాత్తాపం చెందడం, దాన కృత్యాలు చేయడం ఇత్యాది కార్యకలాపాలతో ఈ శ్రమదినాలు పరిపూర్ణమైపోతాయా? మొదటి మూడూ వ్యక్తిగత విషయాలు. ఉపవాసం వల్ల వేరెవరికీ ప్రయోజనం లేదు. ఉపవాసం పాటించే వ్యక్తికి శారీరకంగా, మానసికంగా కొంత ఉపయోగం ఉండవచ్చు. అలాగే ప్రార్థన కూడా వ్యక్తిగతం. పశ్చాత్తాపం చెందడం కూడా స్వవిషయమే! శక్తి కొద్దీ దానధర్మాలు చేయడంలో సామాజిక కోణం దాగి ఉన్నది.
దీనివల్ల అన్నార్తులకు ఊరట లభిస్తుంది. ప్రభువు కోసం కన్నీటి ప్రార్థన చేసినా, చేయక పోయినా ఇబ్బంది లేదు గానీ, నీ స్వార్థం కోసం ఇతరులను ఇబ్బందిపెట్టకూడదు. దైవ సమీపమే ఉపవాసం. దైవ వాక్యం శ్రద్ధగా వినడమే ఉపవాసం. నలభై దినాల పాటు గుడిలోనే కదలకుండా కూర్చున్నంత మాత్రాన దేవుడు కూడా నిన్ను నమ్మడంటే నమ్మడు. మతాచారాన్ని కఠినంగా ఆచరించే వారు చాలామంది ఉంటారు. వారిలో కొందరు ఆ మత నియమాన్ని ప్రయోగాత్మకంగా మానవత్వం వైపు మళ్లిస్తున్నవాళ్లు నిజంగా ధన్యులు. వారిపై దైవకృప సదా వర్షిస్తూ ఉంటుంది.
…? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

