ప్యాంగ్యాంగ్ : తమ దేశ జాతీయ వార్షికోత్సవాలను చప్పగా నిర్వహించిన ఉత్తర కొరియా (North Korea) .. రెండు రోజులు గడిచిందో లేదో తమలో ఆ వాసనలు పోలేదని నిరూపించుకున్నది. అణు ఒప్పందంపై అమెరికాతో సుదీర్ఘ ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఈ మధ్యనే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులను పరీక్షించి అమెరికాకు సవాల్ విసిరింది. ఈ ప్రయోగ పరీక్షలు శని, ఆదివారాల్లో కొనసాగాయని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది. ఈ క్షిపణులు ఉత్తర కొరియా ప్రాదేశిక జలాలపైన ఫిగర్-8 నమూనాలతోపాటు 1500 కిలోమీటర్ల వరకు విమాన మార్గాల్లో ప్రయాణించాలని కేసీఎన్ఏ పేర్కొన్నది. ఈ పరీక్షలు విజయవంతమయ్యాయని కూడా వెల్లడించింది.
క్షిపణి పరీక్షలు సోమవారం జరిగినట్లు ఆ దేశ అధికార పత్రిక ‘రాండాంగ్ సిన్మన్’ నివేదించింది. ప్రయోగవాహనంపై ఉన్న ఐదు ట్యూబుల్లోని ఒకదాని నుంచి నిప్పులు కక్కుతూ మిస్సైల్స్ దూసుకెళ్తున్న ఫొటోలను ప్రచురించింది. ఇలాంటి ఆయుధం ఉత్తర కొరియా ఆయుధాల సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది దక్షిణ కొరియా చేపట్టిన సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా అని చెప్తున్నారు.
అణ్యాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలు చేపట్టకుండా ఉత్తర కొరియాపై ఆంక్షలు ఉన్నాయి. అమెరికా దండయాత్ర నుంచి కాపాడుకోవడానికి ఇలాంటివి అవసరమని ఉత్తర కొరియా చెప్తూ ఉన్నది. అమెరికాతో ప్రతిష్టంభన కొనసాగుతున్నా.. క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి ఉత్తర కొరియా నిలుపకపోవడం విశేషం.
బర్రెపై ఎక్కి వచ్చి నామినేషన్ దాఖలు.. ఎక్కడంటే..?
నీట్ వ్యతిరేక బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం
యాంటీఆక్సిడెంట్ మందుతో గుండెపోటు నివారించొచ్చు
సౌరశక్తి పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలి: వెంకయ్యనాయుడు
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వే
పాకిస్తాన్‌కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్‌ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..