Venkaiah Naidu : సౌరశక్తి పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలి: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu : సౌరశక్తి వినియోగానికి అవసరమైన పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి...

పుదుచ్చేరి : సౌరశక్తి వినియోగానికి అవసరమైన పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) పిలుపునిచ్చారు. ఈ విషయంలో దిగుమతుల మీదే మనం ఆధారపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రాల క్రియాశీలక భాగస్వామ్యం ద్వారా సౌరశక్తి వినియోగంలో ఆత్మనిర్భరత ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. పుదుచ్చేరి పర్యటనలో భాగంగా సోమవారం పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలోని 2.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.
సౌర, పవన, తక్కువ నీటిని వినియోగించుకునే విద్యుత్ వ్యవస్థలు, పర్యావరణాన్ని కాపాడుకుంటూ భవిష్యత్‌లో ఎదురయ్యే ఇంధన అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయం కాగలవని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. రానున్న కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశ వృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించటంలో భాగంగా శిక్షణా రంగంలో పెట్టుబడులు పెట్టాలని, శ్రామిక శక్తిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సౌర విద్యుత్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నీటి మీద తేలియాడే, భవనాల పైభాగంలో ఏర్పాటు చేసుకోగల సౌరశక్తి వ్యవస్థల వంటి వాటి మీద దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగసామి, స్పీకర్ ఎంబలమ్ ఆర్ సెల్వమ్, కళాపేట్ శాసనసభ్యులు పీఎంఎల్ కళ్యాణసుందరం, పాండిచ్చేరి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ గుర్మిత్ సింగ్, డైరక్టర్ ఆఫ్ స్డడీస్ డాక్టర్ ఎస్ బాలకృష్ణన్‌తోపాటు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వే
పాకిస్తాన్‌కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్‌ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

