Taliban : పాకిస్తాన్‌కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
Taliban : తాలిబాన్‌కు సహకరించాలనుకుంటున్న పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. తాజాగా మా ఆస్తకులు మాకుంటాయి, వాటిని మేం చూసుకుంటామని పాకిస్తాన్‌కు...

కాబూల్ : (Taliban) తాలిబాన్‌కు సహకరించాలనుకుంటున్న పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. తాజాగా మా ఆస్తకులు మాకుంటాయి, వాటిని మేం చూసుకుంటామని పాకిస్తాన్‌కు షాకిచ్చింది. కొన్ని రోజుల క్రితం కాబూల్ విమానాశ్రయాన్ని పునర్నిర్మించి, తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు పాకిస్తాన్ ముందుకురాగా.. తాలిబాన్ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ పనులను టర్కీ, ఖతార్లకు అప్పగించింది. అనంతరం, తాలిబాన్‌కు పరిపాలనలో సహాయం చేస్తామని పాకిస్తాన్ ప్రతిపాదన తేగా.. తమ సొంత అంగీకారం ప్రకారం పని చేస్తామని చెప్పి తిరస్కరించింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన మొదలైన తర్వాత, పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి సమస్యపై వారికి మార్గదర్శకంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నది. అయితే, ప్రతీ సమస్యపై తాలిబాన్ తమదైన రీతిలో పాక్‌కు షాక్‌లు ఇస్తున్నది. విమానాశ్రయం, పరిపాలన తర్వాత, ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో పాకిస్తాన్ ప్రతిపాదనను తాలిబాన్ సున్నితంగా తిరస్కరించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ రూపాయిల్లో వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ఇమ్రాన్ ప్రభుత్వం చెప్పింది. దీనిని తాలిబాన్ నేతలు ఖండించారు. తమ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వంతో బలమైన వ్యాపార సంబంధాలను కోరుకుంటున్నామని, దీని కోసం పాకిస్తాన్ కరెన్సీని ఉపయోగించాలని భావిస్తున్నట్లు ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక మంత్రి షౌకత్ తారిన్ పార్లమెంటులో, బయట మాట్లాడుతూ చెప్పాడు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు రెండు దేశాలు పాక్ కరెన్సీని ఉపయోగించవచ్చని తారిన్ సూచించారు. మూడు రోజుల మౌనం తర్వాత తాలిబాన్ ప్రతినిధులు దీనిపై స్పందించారు. పరస్పర వ్యాపారం మా కరెన్సీలోనే జరుగుతుందని మేం స్పష్టం చేయాలనుకుంటున్నామని తాలిబాన్ ప్రతినిధి అహ్మదుల్లా వాసిక్ స్పష్టం చేశారు. ‘కరెన్సీ మార్పిడి చేయం. మేం మా గుర్తింపునకు విలువ ఇస్తాం. అలాగే ఉండాలని కోరుకుంటాం, ఈ విషయంలో రాజీ పడేది లేదు’ అని వాసిక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్‌ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
టీవీ యాంకర్‌గా నటుడు సోనూ సూద్.. ఏ ఛానల్లో.. ఏ ప్రోగ్రాంలో..?
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

