Bhupendra Patel : గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
Bhupendra Patel : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్...

అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. గుజరాతీ భాషలో భూపేంద్ర పటేల్ ప్రమాణం చేశారు. భూపేంద్ర పటేల్ గుజరాత్ 17 వ ముఖ్యమంత్రి.
అనంతరం అమిత్ షా ను స్వాగతించేందుకు పటేల్ విమానాశ్రయానికి వెళ్లారు. అమిత్ షాకు దండం పెట్టి స్వాగతించగా.. ఆయన పటేల్ వీపుపై తట్టారు. అంతకుముందు తన ఇంట్లో ప్రార్థనలు చేశారు. అనంతరం తాల్తేజ్లోని సాయిబాబా దేవాలయం, అదలాజ్లోని దాదా భగవన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి నేరుగా నితిన్ పటేల్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు అందుకున్నారు. జామ్‌నగర్‌లో వరద బాదితులకు సహాయం చేస్తానని తొలి ట్వీట్ చేశారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వే
పాకిస్తాన్‌కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్‌ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
టీవీ యాంకర్‌గా నటుడు సోనూ సూద్.. ఏ ఛానల్లో.. ఏ ప్రోగ్రాంలో..?
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

