Anti NEET Bill : నీట్ వ్యతిరేక బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం
Anti NEET Bill : తమిళనాడు నీట్ వ్యతిరేక బిల్లు-2021 ను సోమవారం నాటి అసెంబ్లీ సమావేశంలో డీఎంకే ప్రవేశపెట్టింది. ఈ బిల్లను సభ ఏకగ్రీవంగా...

చెన్నై : నీట్ వ్యతిరేక బిల్లును (Anti NEET Bill) తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. తమిళనాడు నీట్ వ్యతిరేక బిల్లు-2021 ను సోమవారం నాటి అసెంబ్లీ సమావేశంలో డీఎంకే ప్రవేశపెట్టింది. ఈ బిల్లను సభ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. నీట్లో పాస్ కాలేనన్న బెంగతో సేలంకు చెందిన విద్యార్థి ధనుష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో కలకలం రేపింది. దాంతో దేశంలోని ప్రధాన సమస్యల్లో ముఖ్యమైనది నీట్ అని, దీన్ని రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆగమేఘాల మీద బిల్లను సభలో ప్రవేశపెట్టి ఆమోదించేలా చేయగలిగారు.
అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం ఆలిండియా స్థాయి ప్రవేశ పరీక్ష నీట్. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2013 లో సిఫారసు చేసినప్పటి నుంచి తమిళనాడు రాష్ట్రం తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నది. దాంతో ప్రభుత్వం తమిళనాడు నీట్ వ్యతిరేక బిల్లు-2021 ను సభలో ప్రవేశపెట్టింది. తమిళనాడులో చదువుతున్న విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వ వైద్య ప్రవేశ పరీక్ష నుంచి శాశ్వత మినహాయింపును ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే ఈ బిల్లుకు మొదట మద్దతునిచ్చింది. ఇతర రాజకీయ పార్టీలైన పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే), విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే, బీజేపీ మాత్రం బిల్లును వ్యతిరేకించి సభ నుంచి వాకౌట్ చేసింది.
ఈ ఏడాది జూన్ 5 న రిటైర్డ్ జడ్జి ఏకే రాజన్ నేతృత్వంలో ప్యానెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. దాంతో పలువురు విద్యావేత్తలు, రాష్ట్ర విద్యా శాఖ అధికారులతో కూడిన ప్యానెల్ తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై నీట్ ప్రభావం, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులపై దాని ప్రభావాలపై అధ్యయనం చేసింది. ఈ నివేదికను ఇటీవలనే ప్రభుత్వానికి అందించారు.
ఇవి కూడా చదవండి..
యాంటీఆక్సిడెంట్ మందుతో గుండెపోటు నివారించొచ్చు
సౌరశక్తి పలకలు, ఇతర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలి: వెంకయ్యనాయుడు
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వే
పాకిస్తాన్‌కు తాలిబాన్ షాక్.. మా ఆసక్తులు మాకుంటాయని వెల్లడి
9/11 వంటి పెద్ద దాడి జరుగొచ్చు : అమెరికాకు చైనా హెచ్చరిక
హైదరాబాద్‌ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

