రేవంత్ గురుభక్తి వల్లే పాలమూరు ఎడారి
సీఎం రేవంత్‌రెడ్డి తన గురుభక్తి చాటుకోవ డం కోసమే తెలంగాణ ప్రయోజనాలను, రాష్ట్ర రైతుల హకులను ఏపీ సీఎం చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ చేస్తున్న ఈ చారిత్రక తప్పిదాలకు కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకో క తప్పదని హెచ్చరించారు.
- బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి.. పానగల్ వద్ద హౌస్ అరెస్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/వనపర్తి టౌన్, సెప్టెంబర్ 21: సీఎం రేవంత్‌రెడ్డి తన గురుభక్తి చాటుకోవ డం కోసమే తెలంగాణ ప్రయోజనాలను, రాష్ట్ర రైతుల హకులను ఏపీ సీఎం చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ చేస్తున్న ఈ చారిత్రక తప్పిదాలకు కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకో క తప్పదని హెచ్చరించారు.
జూరాల ప్రాజె క్టు ముట్టడికి వెళ్తున్న నిరంజన్‌రెడ్డిని సోమవారం ఉదయాన్నే వనపర్తి జిల్లా పాన్‌గల్ మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నిర్బంధంలోకి తీసుకొని ఇంటికి తరలించి, హౌస్ అరెస్టు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చేతులు జోడించి మొక్కుతున్నా.. రైతులను ఆగం చేయొద్దు. జూరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయండి. ఎండుతున్న పంటలను కాపాడండి’ అని ప్రభుత్వాన్ని కోరారు.
పోలీస్ నిర్బంధాన్ని ఖండించిన కేటీఆర్
జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభితో ఫోన్లో మాట్లాడి రైతులను ఆదుకోవాలని కోరారు. పాలమూరు జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేయడాన్ని ఖండించారు. జూరాల ప్రాజెక్టు ముట్టడి వివరాలను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకొన్నారు. పాలమూరు సాగు జలాలు, జూరాల నీటి లభ్యత, ఇతర అంశాలపై చర్చించేందుకు మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

