క్యాల్షియం మాత్రలు సరిపోతాయా..!
వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గిపోతుంది. వాటిని దృఢపరచాలన్న ఉద్దేశంతో చాలామంది పెద్దలు క్యాల్షియం, విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. అయితే వృద్ధులు కిందపడ్డప్పుడు ఎముకలు విరిగే అవకాశాలను తగ్గించే విషయంలో ఇవి అంత గొప్పగా ఏమీ పనిచేయడం లేదని తాజా ఆరోగ్య సమీక్ష ఒకటి తేల్చి చెప్పింది.
వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గిపోతుంది. వాటిని దృఢపరచాలన్న ఉద్దేశంతో చాలామంది పెద్దలు క్యాల్షియం, విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. అయితే వృద్ధులు కిందపడ్డప్పుడు ఎముకలు విరిగే అవకాశాలను తగ్గించే విషయంలో ఇవి అంత గొప్పగా ఏమీ పనిచేయడం లేదని తాజా ఆరోగ్య సమీక్ష ఒకటి తేల్చి చెప్పింది. 1.53 లక్షల మంది పెద్దల మీద జరిపిన ఓ సర్వేను ఇందుకోసం తీసుకున్నారు. అందులోని వ్యక్తులు ఎముకల దెబ్బల బారిన పడిన చాలా సందర్భాలను సమీక్షించారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్ (బీఎంజే)లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఎముకల ఆరోగ్యం మీద కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ వ్యక్తుల్లో కొందరు రెండు రకాల మాత్రలూ వేసుకుంటే, కొందరు ఏదో ఒక రకం మాత్రమే వేసుకున్నారు.
అయితే పడినప్పుడు ఎముకలు విరిగే లేదా పగుళ్లు వచ్చే విషయంలో, ముఖ్యంగా తుంటి ఎముకలకు సంబంధించిన దెబ్బల విషయంలో ఈ మాత్రలు పెద్ద ప్రభావవంతంగా పనిచేసినట్టు ఆధారాలేమీ లభించలేదట. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరం సమతుల్యాన్ని కోల్పోతుంది. అందుకే పెద్దలు తూలుతుంటారు. కాబట్టి మాత్రల కన్నా, బ్యాలన్సింగ్తో పాటు ఎముకలను దృఢపరిచే ఇతర వ్యాయామాలు కూడా గాయాలనుంచి కాపాడే విషయంలో పరిశీలించాల్సి ఉందని ఈ అధ్యయనం చెబుతున్నది. అలాగే సమతులాహార ప్రాధాన్యాన్నీ ప్రస్తావించింది. అయితే ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారే వ్యాధి)లాంటి వాటితో పాటు ఇతర ఎముకల జబ్బులు ఉన్నవారికి వీటి అవసరం వేరుగా ఉండి ఉండవచ్చునని వెల్లడించారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

