ఆకలి కావట్లేదని, తిన్నది అరగట్లేదని వచ్చే రోగులకు మందు గోలీలు రాయకుండా కొన్ని పండ్లు, పప్పులు, ధాన్యాలు తినమని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారట. గట్ హెల్త్ని పెంచే ఆహారం తింటే మాత్రలు మింగే అవసరమే లేదని, సమస్య మళ్లీ రాదని చెబుతున్నారు.
ఇంతకూ వాళ్లు ఏం తినమంటున్నారో తెలుసా? కివీ పండ్లు, యోగర్ట్, చియా గింజలు, పప్పు ధాన్యాలు, ఓట్స్ తినాలట! ఇవి తింటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిలో ఉండే అధికపీచు వల్ల జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేస్తుందని చెబుతున్నారు.