Nepal PM : నేపాల్ (Nepal) ఉప ప్రధాని (Deputy PM) బిష్ణు పౌడెల్ పోఖరా (Bishnu Paudel Pokhara), మెట్రోపాలిటన్ మేయర్ (Metropolitan Mayor) ధనరాజ్ ఆచార్య (Dhanraj Acharya) శనివారం జరిగిన ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో గాయపడ్డారు. హైడ్రోజన్ బెలూన్ (Hydrozen Balloon) పేలి మంటలు చెలరేగడంతో వారికి కాలిన గాయాలయ్యాయి. దాంతో ఇద్దరినీ హుటాహుటిన హెలిక్యాప్టర్‌లో ఖాట్మండుకు తరలించారు. టూరిజం ఇయర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఓ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుండగా హైడ్రోజన్‌తో నింపిన బెలూన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, దాంతో వేదికపై ఉన్న బిష్ణు పౌడెల్, ధన్‌రాజ్ ఆచార్య గాయపడ్డారని నేపాల్ మీడియా పేర్కొంది. దాంతో చికిత్స కోసం వారిని ఖాట్మండు తరలించినట్టు కాస్కి జిల్లా ఎస్పీ శ్యామ్‌నాథ్ ఓలియా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
बेलुन फुटेर आगो सल्किँदा अर्थमन्त्री विष्णु पौडेल र पोखरा महानगरपालिकाका प्रमुख धनराज आचार्य घाइेत भएका छन्। pic.twitter.com/ECIt4H3kuo
— Bipin Sapkota (@bipinsapkota213) February 15, 2025
ఈ ఘటనలో పౌడెల్ చేతులు, ముఖానికి గాయాలైనట్టు ఆయన ప్రెస్ అడ్వయిజర్ భువన్ కేసీ తెలిపారు. ఆచార్యకు సైతం పలు గాయాలైనట్టు చెప్పారు. కాగా పౌడెల్ నేపాల్ ఉప ప్రధానిగా ఉండటంతోపాటు దేశ ఆర్థికమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.
Rahul Gandhi | ఏఐ టెక్నాలీజీపై మాటలు కాదు, చేతలు కావాలి.. ప్రధానిపై రాహుల్‌గాంధీ కామెంట్స్
Alcohol Consumers | మద్యం సేవించే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువట.. ప్రభుత్వ సర్వేలో వెల్లడి
High Court | భార్య వేరొకరిని ప్రేమించడం నేరం కాదు.. అది లేనపుడు వివాహేతర సంబంధం కాదు: హైకోర్టు
Husband Dies Of Illness, Wife Hangs Self | అనారోగ్యంతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
Marco Ebben: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
Elon Musk | నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్.. రచయిత్రి సంచలన పోస్ట్