International
- Jan 08, 2021 , 01:43:48
ఇవాంకా.. వారు దేశభక్తులా?

- ట్రంప్ కుమార్తె ట్వీట్‌పై విమర్శలు
వాషింగ్టన్: యూఎస్ క్యాపిటల్‌ను ముట్టడించిన ఆందోళనకారులను ‘దేశభక్తులు’ అంటూ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ సీనియర్ అడ్వైజర్ ఇవాంకా ట్రంప్ అభివర్ణించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలిగించారు. పోలీసులతో ఘర్షణకు దిగి హింసకు పాల్పడినవారు దేశభక్తులెలా అవుతారని న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి మ్యాగీ హేబర్మ్యాన్ ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్య అల్లరిమూకలకు మరింత ఊతమిచ్చేలా ఉందని విమర్శించారు. దీంతో ‘శాంతియుత నిరసనలే దేశభక్తి. హింసను ఆమోదించరాదు.. దానిని కఠినంగా అణచివేయాలి’ అంటూ ఇవాంక మరో ట్వీట్ చేశారు.
తాజావార్తలు
MOST READ
TRENDING