Nepal Floods | పొరుగు దేశం నేపాల్ (Nepal)లో వరద (Floods) బీభత్సం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తూర్పు, మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ జల ప్రళయానికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 68 మంది గల్లంతవ్వగా.. వంద మందికిపైగా గాయపడ్డారు.
ఇక ఈ వరదలకు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. వెయ్యికిపైగా ఇళ్లు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. భాగమతి నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా రోడ్లు ధ్వంసమవడంతో.. 39 జిల్లాల్లో రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు 3 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు వెయ్యి మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read..
BookMyShow | బ్లాక్ టికెట్ల వ్యవహారం.. బుక్ మై షో సీఈవోకు మరోసారి సమన్లు
Mithun Chakraborty | మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
Swag Trailer | శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో.. ఇంట్రెస్టింగ్గా ‘స్వాగ్’ ట్రైలర్