Sree Vishnu Swag Trailer | టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్(Swag). ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో నటిస్తుంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 04న విడుదల చేయనున్నట్లు చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది.
స్టోరీని రివీల్ చేయకుండా శ్రీ విష్ణు మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీ విష్ణు నాలుగు పాత్రల్లో అలరించబోతుండగా.. రీతూ వర్మ కూడా డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుండగా.. దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.